రబీ పంటల భీమా చేయించండి- వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యేలు

2024-25 పంటల భీమాను చేయించి రైతులు సురక్షితంగా పంటలను సాగు చేసుకోవాలని వక్తలు కోరారు. రబీ పంటల భీమాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను శనివారం కలెక్టర్ కాన్ఫిరెన్స్ కార్యాలయంలో ప్రారంభించారు. డిశంబర్ 15తో భీమా గడువు ముగుస్తున్నందుకు రైతులు త్వర పడి రబీలో తాము సాగు చేసిన పంటలకు భీమా చేయించుకోవాలని తెలిపారు. అభివృద్ధి పర్యవేక్షణ కమిటి చైర్మన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మంత్రి బాల వీరాంజనేయ స్వామి, మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు, సంతనూతన పాడు, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్థన్, బి. ఎన్ విజయ కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, ఎం అశోక్ రెడ్డి, 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *