బాలినేని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు – ప్రణీత్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలు అసత్యాలు – మీడియా సమావేశంలో చిన్నగంజాం ఎంపీపీ అంకమ్మ రెడ్డి

డాక్టర్ అశోక్ బాబు కు తనకు మధ్య భూ వ్యాపార లావాదేవీలు తప్ప……… ఎటువంటి రాజకీయం వ్యవహారాలు లేవని మా వ్యాపార లావాదేవీలలో ……….. బాలినేని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ……బాలినేని ప్రణిత్ రెడ్డి పై చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఎంపీపీ కోమట్ల అంకమ్మ రెడ్డి తెలిపారు. బాలినేని ప్రణీత్ రెడ్డి పై చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో చిన్నగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ……..డాక్టర్ యాదాల అశోక్ బాబు తాను కలిసి 25 లక్షలు పెట్టి ఇసుక ల్యాండ్ కొన్నామని.. … ల్యాండ్ తాలూకా తనకు 18 లక్షలు అశోక్ బాబు ఇచ్చారని తెలిపారు. పొలం కొన్న కొన్నిరోజులకు ఇసుక ల్యాండ్ జేపీ సంస్థ కు ఇవ్వడంతో తన డబ్బులు తన కి వెన్నక్కి ఇవ్వాలని అడగగా 18 లక్షలలో 10 లక్షలు ఇచ్చాన్నాని.. మిగిలిన 8 లక్షలు ఇస్తానని తెలపడం జరిగిందని తెలిపారు. ఇటీవల తాలూకా స్టేషన్ లో పిర్యాదు చేయగా తాను సీఐ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పగా సివిల్ పంచాయతీ కాబట్టి మీరు బయట సెటిల్ చేసుకోవాలని చెప్పడం జరిగిందని తెలిపారు . అందుకు అశోక్ బాబు రూ . 8 లక్షల తాలూకా అగ్రిమెంట్ చేపించి తన చే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని పంపగా…….. ఇంకో కాపీ కూడా ఇవ్వమని అడగడం జరిగిందని……. అందుకు అశోక్ బాబు ఇవ్వను సంతకం పెట్టు ……. ఆ అగ్రిమెంట్ నా దగ్గర ఉంటుందని అనడంతో….. తా ను సంతకం పెట్టలేదని తెలిపారు. కావాలని మళ్ళీ బాలినేని ప్రణిత్ రెడ్డి, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ పిర్యాదు ఇవ్వడం జరిగిందని అన్నారు . ఈ పిర్యాదులో ఎటువంటి నిజం లేదని మా ఇద్దరి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలలో బాలినేని ప్రణీత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని అయన పై చేసిన అసత్య ఆరోపణల వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించే స్థాయి నాది కాదని, ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి అతనిది కాదని అన్నారు. బాలినేని కుటుంబంతో ఎంతో మంది రాజకీయంగా తిరుగుతారని, కేవలం కావాలని వారి పై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని అన్నారు. బాలినేని కుటుంబం ఆయనకు జడ్పిటిసి టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. నాకు ల్యాండ్ తాలూకా కాకుండా విడిగా ఒక్క రూపాయి అయినా ఇచ్చినట్లు నిరూపించాలని ………. నేను నా కుటుంబం ఏ దేవుడు వొద్ద అయినా ప్రమాణం చేయడానికి సిద్ధమని , అశోక్ బాబు వారి కుటుంబంతో కలిసి ఆయన ఇష్ట దేవుడు వద్దకు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు . కేవలం కావాలని బాలినేని కుటుంబాన్ని ……. మా వ్యాపార లావాదేవీల మధ్యలోకి తీసుకుని వచ్చారని ……అలా వాళ్ళను తీసుకురావటం మంచి పద్ధతి కాదని ….. బాలినేని ప్రణీత్ రెడ్డి పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని అన్నారు . ఆయనకు ఇవ్వవలసిన రూ . 8 లక్షల తాలూకా ఇవ్వడానికి సిద్దమని, బాలినేని ప్రణీత్ రెడ్డి పై చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు .డాక్టర్ అశోక్ బాబు బాలినేని కుటుంబం ద్వారా రాజకీయాలలో ఎదిగి వారిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదని వారి కుటుంబంపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *