ఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌.డి.కుమారస్వామిని కలిసి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం

కుమారస్వామిని కలిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ పి.వి.మిధున్‌ రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మద్దిల గురుమూర్తి, మేడా రఘునాధ్‌ రెడ్డి, గుమ్మ తనూజా రాణి తదితరులు కలసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది, తద్వారా లాభదాయకతను ప్రభావితం చేస్తుందని కేంద్రమంత్రికి తెలిపారు.
విశాఖ ఉక్కు టర్న్‌ అరౌండ్‌ సాధించడానికి అవసరమైన చేయూత కేంద్రం అందించాలని వినతిపత్రంలో కోరిన ఎంపీలు, మరో రెండేళ్ళపాటు కేంద్రం నుంచి చేయూత అందితే ఆర్ధిక పరిస్ధితి మెరుగువుతుందన్న ఎంపీలు
అన్నారు.
ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించడానికి వీలుగా ఆర్‌ఐఎన్‌ల్ కు క్యాప్టివ్‌ మైన్‌లను కేటాయించడం ద్వారా వ్యయప్రతికూలతలను అధిగమించేందుకు సహాయపడుతుందని, కేంద్ర సహకారం అందిస్తే ప్లాంట్‌ మళ్ళీ లాభదాయకమైన వెంచర్‌గా మారుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆర్ధిక పునర్నిర్మాణానికి కేంద్రం సాయపడాలని విజ్ఞప్తి, తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం, వచ్చే కేబినెట్ లో ఈ ప్రతిపాదనలు పెడతానని హామీ ఇచ్చారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *