అన్యాక్రాంతం, ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు గురవుతున్న స్కందపురి జనార్ధన స్వామి దేవస్థానం భూమి పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు తో పాటు సర్వే చేసి 297/1బి1 లోని 694.23 ఎకరాలలో ప్రస్తుతం ఉన్న 194.98 ఎకరాల భూమి సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ హిందు చైతన్య వేదిక రాష్ట్ర సహా సమన్వయ కర్త డిమాండ్ చేశారు. సోమవారం ఆమేరకు కందుకూరు సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. స్కంద పురి జనార్ధన స్వామి వారి కి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, అర్చకుల భుక్తి కొరకు దాతలు ఇచ్చిన భూములు రాను రాను అన్యాక్రాంతం అవడం తోపాటు ఆక్రమణలకు గురవుతున్నా, దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమిలో అన్య మతస్తులు ప్రార్థన మందిరాలనిర్మాణాలు శాశ్వతంగా చేస్తున్న అరికట్టక పోగా పురపాలక, రెవెన్యూ, విద్యుత్, ఇంజనీరింగ్ శాఖలు ఇష్టారీతిన అనుమతులు ఇచ్చిన వారి పై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హిందు చైతన్య వేదిక డిమాండ్ చేసింది. దేవుడి భూములన్నా, ఆస్తులన్నా చులకన అయిపోయిందని వారు విమర్శించారు. ఈ సర్వే నంబర్ లో మొత్తం 694.27 ఎకరాల భూమి ఉండగా ప్రభుత్వ వివిధ సంక్షేమ, ప్రజోపయోగ పథకాలకు ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న భూమి పోను మిగిలిన భూమి ఆక్రమణలకు, అక్రమకట్టడాలకు గురి కాకుండా కాపాడాలని భూమి సమగ్ర సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చెయ్యాలని హిందు చైతన్య వేదిక కందుకూరు సబ్ కలెక్టర్ ని కోరింది. ఈ సమస్య పై దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి గతం లో మిగిలిన భూమి ఆక్రమణలకు గురి కాకుండా సమగ్ర సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చెయ్యాలని ప్రభుతానికి సబ్ కలెక్టర్ కి విన్నవించింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమిలో అన్య మతస్తుల ఆక్రమణలను అక్రమ కట్టడాలను, ప్రార్థన మందిరాలను తొలగించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేవాదాయ భూమిని కాపాడాలని, సర్వే చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట హిందు చైతన్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.
