ప్రస్తుతం తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నందుకు ఖరీఫ్ సాగు చేసిన వరి కోత దశలో ఉన్నందుకు వరి కోతలు వాయిదా వేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. శివ రామపురం, మాధవరం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. పంట దశలను పట్టి నెల రకాలను పట్టి అవసరమైన చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలని కోరారు. విఏఏ లు ఎం రాజశేఖర్ రెడ్డి, సుధీర్ ఎఈఓ నాగ రాజు తదితరులు పాల్గొన్నారు.

