జిల్లాలో 38 మండలాలలో మంగళవారం 806.8 మి.మీల, సరాసరి 21.2 వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అందులో కనిగిరిలో అత్యధికంగా 72.6 మి.మీలు నమోదు కాగా పుల్లల చెరువులో అత్యల్పంగా 1.4 మి.మీలు నమోదు అయినది. మద్దిపాడులో 50.2 మి.మీలు, హెచ్ఎం పాడులో 50.0, కొత్త పట్నంలో 47.4, బేస్త వారి పేట 44.6, నాగులుప్పల పాడు 43.6, నాగులుప్పల పాడు 43.6, పీ సీ పల్లి 38.2, కంభం 34.8, కొమ రోలు 34.0, గిద్దలూరు 32.6, వెలిగండ్ల, ఒంగోలులలో 32.4, కొండేపి లో 29.4, తర్లు పాడులో 22.8, సంత నూతల పాడులో 22.6, పొన్న లూరు లో 22.4, పొదిలి లో 16.4, రాచర్లలో 16.2, పామూరు 15.4, తాళ్లూరు, సీఎస్ పురం లలో 15.2 చొప్పున, మర్రిపూడిలో 12.2, మార్కాపురం 11.4, దర్శి 11.2, అర్ధ వీడు 10.2, యర్రగొండ పాలెం 8.6, చీమకుర్తి 8.4, దోర్నాల, కే కే మిట్ట 8.2 చొప్పున, జరుగు మల్లి 6.2, శింగ రాయ కొండ 5.8, త్రిపురాంతకం 5.6, టంగుటూరు 5.4, కురిచేడు 5.0, దోర్నాల 4.6, పెద్దార వీడు 3.8, ముండ్లమూరు 2.2 మి.మీల చొప్పున నమోదు అయినది.
అధిక వర్షాల వలన ఇప్పటికే సాగు చేసి కోతలలో ఉన్న పలు పంటలలో ఉత్తమ యాజమాన్య చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాస రావు తెలిపారు. పెరుగుదల దశలో ఉన్న వరి మొక్క జొన్న, కంది, మిరప, మినుము, పెసర, శనగ, వేరు శనగలలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి ఆయన వివరించారు.
