దివ్యాంగుల సంక్షేమానికి, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు.
అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలసి పాల్గొని జ్యోతి ప్రజల్వన గావించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ… అంతర్జాతీ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఈ నెల 2న సుమారు 300 మంది దివ్యాంగుల విద్యార్దులకు వివిధ క్రీడా అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని, అవసరమైన వారికి పరికరాలు అందజేస్తునన్నట్లు వివరించారు. విభిన్న ప్రతిభావంతులకు నిర్దేశించిన వికలాంగుల హక్కుల చట్టం జిల్లాలో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం తో పాటు ప్రత్యేక గ్రీవెన్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కొరకు ప్రత్యేక నియామక ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. దివ్యాంగు విద్యార్ధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన రంగాల్లో శిక్షణ ఇవ్వడం తో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే జీవితంలో స్థిర పడేలా ఆర్ధిక తోడ్పాటు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో అమలు జరుగుచున్న బంగారు బాల్యం కార్యక్రమం ద్వారా దివ్యాంగ విద్యార్థుల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ… విభిన్న ప్రతిభావంతులకు ఆర్ధిక తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నదన్నారు. విభిన్న ప్రతిభావంతులతో నాకు దాదాపు 25 సంవత్సరాల అనుబంధం వుందని, పేద కుటుంబాల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో విభిన్న ప్రతిభావంతుల కొరకు ప్రత్యేకంగా హాస్టల్ ను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అంగవైకల్యం అనేది మీ శరీరానికే గాని, మీ మనస్సుకు, ప్రతిభకు కాదని, నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి నారాయణ, మెప్మా పిడి రవి కుమార్, చీమకుర్తి ఎస్.ఆర్.కె చెవిటి, మూగ పిల్లల పాటశాల కరస్పాండెంట్ అంజి రెడ్డి, ప్రతిభావంతుల వివిధ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు వెంకటేశ్వర రెడ్డి, నటరాజ్, రాధాకృష్ణ యాదవ్, శ్రీనివాసులు రెడ్డి, శివకృష్ణ రెడ్డి, వర ప్రసాద్, ఏడుకొండలు, చక్రపాణి, మహబూబ్ వలి, సులోచన తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చీమకుర్తి ఎస్.ఆర్.కె చెవిటి, మూగ పిల్లల పాటశాల విద్యార్ధులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమం, చెంచు రాజు ప్రదర్శించిన మిమిక్రీ, ఖాసిమ్ బీ విజ్ఞానంతో వికసించు అని పాడిన పాట ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తొలుత జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.
అనంతరం విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్స్, టచ్ ఫోన్లు, కుట్టుమిషన్స్ ను, మూడు చక్రాల సైకిల్స్ ను జిల్లా కలెక్టర్ అందచేసారు.
ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విద్యార్ధులు, వివిధ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








