రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు కోలాహలంగా జరిగాయి. బుధవారం నాడు సాయంత్రం ఒంగోలు తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో కార్యకర్తలు, నాయకులు మధ్య మంత్రి తన పుట్టినరోజు రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తెచ్చిన భారీ కేక్ ని కట్ చేశారు. అనంతరం భారీ గజమాలలు, శాలువాలతో మంత్రిని సత్కరించిన కార్యకర్తలు, నేతలు, పలువురు అధికారులు పుష్ప గుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది.




