తాళ్లూరు మండల సర్వేయర్ గా వై.
శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేయుచున్నసర్వేయర్ నాగరాజు బాబు యాక్సిడెంట్ కావటంతో సెలవుపై వెళ్లాడు. ఆయనస్థానంలో ఇప్పటి వరకు తాళ్లూరు సచివాలయ విలేజ్ సర్వేయర్ మల్లిఖార్జున
రావు ఇంచార్చి సర్వేయర్ గా విధులు నిర్వహించారు. ఇక్కడ పనిచేస్తున్న నాగరాజు బాబును డిప్యూటేషన్ పై ఒంగోలుఏడీ కార్యాలయం కు బదిలీ చేసి, టాస్క్ ఫోర్సులో పని చేయుచున్న యన్నాబత్తిన శ్రీనివాసరావును తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంకు బదిలీ చేస్తూ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వూలుజారీ చేశారు. ఆమేరకు సర్వేయర్ శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు.
