ప్రపంచ నేలల దినోత్సవంను తాళ్లూరు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ భూమిలో పోషకాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు. పోషకాల ప్రాముఖ్యతను వివరించారు. పశు వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పశువులు, జీవాల ఎరువులు నెలలకు ఎంతో సారవంతమైనవని చెప్పారు. ఆత్మ బిటీఎం జ్యోతి భూసార పరీక్షల నిర్వహించి కార్డులను బట్టి ఎరువులను వాడాలని తెలిపారు. ఎఈఓ నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
