పార్టీ అభ్యున్నతికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ భవన్లో శనివారం టిడిపి నాయకులతో సమావేశమై నీటి సంఘాల ఎన్నిక పరిస్థితిపై, నామినేషన్ విధానంపై నాయకులతో చర్చించారు. మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మాజీ అధ్యక్షుడు షేక్ పెద కాలేషా వలి (బడే), మానం రమేష్, ఐడమకంటి శ్రీనివాస రెడ్డి, వేణుబాబు, గొంది రమణా రెడ్డి (సమర), రామయ్య, సోము శ్రీను, వెంకట రావు దాసు, సుబ్బారావు, ప్రకాశ్, హనుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

