తాళ్లూరు మండలంలోని వెలుగు వారి పాలెం కొండ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ శనివారం పరిశీలించారు. మండలంలో హైవే నిర్మాణ పనుల నిమిత్తం మట్టి తర్వాకాల కోసం హైవే కాంట్రాక్టర్ తహసీల్దార్ కార్యాలయం నకు అనుమతులు నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనుమతులు మంజూరులో జాప్యం జరుగుతుండటంతో జిల్లా కలెక్టర్కు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ వెలుగు వారి పాలెం, నాగంబొట్ల పాలెం, సోమవర ప్పాడు లలో 489, 325, 229 సర్వే నంబర్లలోని భూములను పరిశీలించి జాప్యానికి గల కారణాలను నివేదించాలని తహసీల్దార్ సంజీవ రావు ను ఆదేశించారు.
వెలుగు వారి పాలెంలో కొండ భూమిని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ
14
Dec