తాళ్లూరు ఎంపీపీడీఓగా పనిచేసిన కొండా యుగ కీర్తి వివాహా మహోత్సవం శనివారం రాత్రి గుంటూరు జిల్లా తాటికొండ మండలం పొన్నేకల్లు లో మహేష్ రెడ్డితో వైభవంగా జరిగింది.
వివాహా కార్యక్రమంలో తాళ్లూరు మండల ప్రజా ప్రతినిథులు, జర్నలిస్ట్ లు పాల్గొని నూతన వధూ వరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు ఎస్ నరేంద్ర నాథ్, టి. శ్రీనివాస రెడ్డిలు పాల్గొని ఎంపీడీఓ కొండా యుగ కీర్తి దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

