ప్రత్యేక భాష ప్రయుక్త రాష్ట్ర సాధనకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి ఆంధ్ర రాష్ట్రము సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు కు తాళ్లూరు మండలం వెలుగువారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (AA) లో ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రధానోపాధ్యాయులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ…
1901 సంవత్సరంలో జన్మించి 1952 లో ప్రాణ త్యాగం చేసిన అమరజీవి సత్యము, అహింస, హరిజనోద్ధరణ నినాదాలతో స్వాతంత్రోద్యమంలో పాల్గొని తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని మద్రాసీలతో పోట్లాడి, ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహా పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ వైస్ చైర్ పర్సన్ జనరాజుపల్లి నాగమణి, విద్యార్థులు పాల్గొన్నారు.



