ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగం బొట్లవారిపాలెం కొండ పొలాల్లో కోడిపందాల స్థావరంపై తాళ్ళూరు ఎస్సై మల్లికార్జునరావు తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న పది మంది ని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 5 కోళ్ళు, రూ.16 వేల నగదు, 8 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
