తూర్పు గంగవరం లో ఆక్రమణల తొలగింపు, కాలువల పూడిక తీత పనులు నిర్వహణ

తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామంలో సైడుకాలువలను ఆక్రమించి కట్టడాలు నిర్మించి వాహన, ప్రజల రాక పోకలకు ఇబ్బం దికరంగా వున్నందున ఆక్రమణలనుతొలగిస్తున్నారు.గ్రామపంచాయతీ ఆద్వర్యంలో గత నాలుగు రోజులుగా దర్శి-చీమకుర్తి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా సైడు కాలువలపై అక్రమ కట్టడాలను నిర్మించిన వాటిని ప్రొక్లెయిన్తో తీయిస్తున్నారు. ఆ గ్రామం వాణిజ్య కేంద్రంగా వుండి నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీవుం ది.గత టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు చొరవతో గ్రామం లో సీసీరోడ్లు, సైడు కాలువలు నిర్మించారు. అయితే గ్రామంలోని వ్యాపారస్తులు, గృహయజమానులు తమ ఇష్టాను సారం సైడు కాలువలను దాటి రోడ్డును ఆక్రమంచి కట్టడాలు చేపట్టారు. కొందరు ప్రభుత్వ స్థలంను అద్దెకు ఇచ్చి సొమ్ము.చేసుకుంటున్నారు. సైడు కాలువలను పూడ్చి రొడ్డు పైకి రావటంతో మొరుగు ” కిందికి ప్రవహించక రోడ్లపై నిలుస్తూ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిం ది. సైడు కాలువలు దాటి రోడ్డు మీద కట్టడాలు చేపట్టడం వల్ల రోడ్డు పూర్తిగా కుం చించుక పోయింది. ఈ మార్గంలో రాక పోకలు సాగించేందుకు నరకయాతనంగా వుంది. ప్రజలు అనేక మార్లు అధికారులను కలిసి ఇబ్బందులు తొలగించాలని విన్న వించారు. ఎంపీడీవో కె.సుందరామయ్య స్పందించి గ్రామసర్పంచ్ తో మాట్లాడారు.సైడు కాల్వలపై వున్న అక్రమ కట్టడాలను తొలగించి,కాలువ పూడిక తీత పను లు చేయించాలని సర్పంచ్ చాట్ల నాగమణి,పంచాయతీ కార్యదర్శి అజయ్ కీర్తి లకు సూచించారు. అధికారుల ఆదేశాను సారం పంచాయతీ ఆధ్వర్యంలో సైడు కాలవ లపై వున్న అక్రమకట్టడాలు తొలగిస్తూ పూడిక తీత పనులు చేయిస్తున్నారు. గ్రామ పంచాయతీ ముందస్తు సమాచారం ఇవ్వటంతో కొందరు సైడు కాలవలపై వున్న వాటిని స్వచ్చందంగా తొలగిస్తున్నారు. తొలగించని వాటిని ప్రొక్లెయిన్ తీయిస్తు న్నారు. ఇక ముందు సైడు కాలువలపై అక్రమకట్టడాలు నిర్మిస్తే గ్రామపంచాయతీ తగు చట్టపర చర్యలు తీసుకోవటం జరుగుతుందని, సైడు కాలువలు దాటి బట్టి బంకులు పెట్ట వద్దని అందరికి గ్రామ పంచాయతీ అధికారులు నోటీసుల ద్వారా ఇచ్చారు. సైడు కాలువలపై వున్న అక్రమ కట్టడాలను తొలగించి, కాలువ పూడిక తీత పనులు చేపట్టటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *