జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన గుంటిగంగమ్మ దేవస్థానం ఆధ్వర్యంలోనిర్మిస్తున్న అన్నదాన సత్రం నిర్మాణానికి గంగపాలెం గ్రామానికి చెందిన భక్తుడు, వైద్యులు డాక్టర్ బాలాజీ రూ . 27 వేల నగదును చైర్మన్ గురు బ్రహ్మంకు విరాళంగా ఆదివారం అందజేశారు. తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం పంచాయతీ గంగపాలెంగ్రామానికి చెందిన పఠాన్ బాలాజీ కుటుంబీకులు గుంటి గంగా భవాని తల్లిభక్తులు. వృత్తి రీత్యా మైసూర్లో స్థిరపడ్డారు. స్వంత గ్రామానికి వచ్చిన ప్పుడల్లా గుంటి గంగమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఆదివారం అమ్మ వారిని దర్శించుకోగా దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కోసం అన్నదాన సత్రంనిర్మాణం చేసున్నట్లు తెలుసుకున్నారు. సత్రనిర్మాణంలో తన వంతు సాయంగా రూ. 27,000లను ఆలయ కమిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ తండ్రి పటాన్ మీరాసాహెబ్, పూజాని ప్రకాష్ పంతులు తదితరులు పాల్గొన్నారు.
