అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ -పొట్టి శ్రీరాములు ఉద్యమస్ఫూర్తి, కార్యదీక్షత, త్యాగనిరతి నేటికి ఎంతో ఆదర్శప్రాయం: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 72 వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీస్ సిబ్బంది శ్రీరాములు గారి చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ……శ్రీరాములు తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మార్పణ చేసి అమరుడయ్యాడని, ఆయన బలిదానం ఫలితంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించిందని, భారతదేశంలో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయినాడని పేర్కొన్నారు. గాంధీ మార్గంలో నడిచి అనేక ఉద్యమాలలో ప్రముఖపాత్ర వహించారని, సత్యము, అహింస ఆశయాలతో హరిజనుల ఉద్దరణకు పాటుపడ్డాడని, అంటరానితనం నిర్మూలన గావించేందుకు ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. గొప్ప దేశభక్తుడు, సమాజసేవకుడు, పీడిత ప్రజల పక్షపాతి, అసలైన గాంధేయవాది, ఆమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఉద్యమస్ఫూర్తి, కార్యదీక్షత, త్యాగనిరతి నేటి తరానికి గొప్ప ఆదర్శమని, ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *