అధికారులు, ప్రజా ప్రతినిథులు సమన్వయంలో ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల సాధనకు ముందుకు సాగాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో సోమవారం పేదరిక నిర్మూలన – గ్రామ పంచాయితీ లక్ష్యాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ… స్థానిక ప్రజా ప్రతినిథులు, అధికారుల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఎంపీడీఓ కె సుందర రామయ్య మాట్లాడుతూ ……ప్రభుత్వం నిర్దేశించిన 17 లక్ష్యాలలో స్థానిక సమస్యలను జోడిస్తూ ప్రధానంగా అందరికి ఉపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, విపత్తుల నుండి రక్షణ సామాజిక ఆర్థిక సమస్యలకు ప్రజలు గురికాకుండా చూడటం, నిస్సహాయులకు ప్రాధమిక సేవలు, మౌళిక సౌకర్యాలు, సహజ వనరులు, ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేలా చూడటం, సామాజిక రక్షణ బధ్రత నెట్ వర్క్ అందరికి అందేలా చూడటం వంటి అంశాలకు దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిథులతో సమన్వయంగా పనిచెయ్యాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, సర్పంచిలు వలి, మందా శ్యామ్సన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కోట శివ లక్ష్మి, ఎం బ్రహ్మా రెడ్డి, ఎఓ సానికొమ్ము సత్యం, ఎపీఎం దేవ రాజ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.


