ఘనంగా విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం నిర్వహణ – నూతన కార్యవర్గం ఎంపిక

41వ పెన్షనర్ల దినోత్సవంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దర్శి తాలూకా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దర్శి రామాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించగా తాళ్లూరు మండలంకు చెందిన పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్శి మండల శాఖ అధ్యక్షుడు ఆర్ వెంకట రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. క్రీశే లు డీఎస్ నగరా కు ఘన నివాళి అర్పించారు. పెన్షనర్ల సమస్యపై చర్చించారు. 75సంవత్సరాలు నిండిన విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. వి ఆంజనేయులు, ఎం వీ సుబ్బా రెడ్డి, వై పీ నాగేశ్వర రావు, షేక్ పెంటు సాహేబ్ , ఎస్ వెంకట రెడ్డి , బి వేమా రెడ్డి, ఎస్పి బాస్కర నాయుడు, ఐ వెంకట రెడ్డి (ఎంఈఓ), మేడగం అంజి రెడ్డి, ఇడమకంటి వెంకట రెడ్డి (ఎల్ ఎఫ్ఎల్ హెచ్ .ఎం) లను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నూతన కమిటీ బాధ్యులు వీరే …

నూతన కమిటీ 2027డిశంబర్ 16 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా జీ వెంకటేశ్వర్లు (రిటైర్డ్ తహసీల్దార్ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పి నాసరయ్య. అసోసియేట్ అధ్యక్షుడిగా ఇడమకంటి వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులుగా వి
బాలాజీ రావు ,జి నాగి రెడ్డి, వి పోలయ్య, జెవీ సుబ్బయ్య లు, ప్రధాన కార్యదర్శి గా ఎస్. రామా రావు, సంయుక్త కార్యదర్శులుగా ఎస్ హనుమంత రావు (ముండ్లమూరు), టి రంగయ్య (దర్శి), సీహెచ్ వీ సుబ్బా రెడ్డి (తాళ్లూరు), ఎం శాసరమ్మ (దొనకొండ), కార్య నిర్వాహక కార్యదర్శులుగా ఎ సుబ్బా రావు జి దేవ సహాయం, జిల్లా కార్యదర్శిగా ఆర్ వెంకట రెడ్డి, కోశాధికారిగా జీవీ రత్నం లను ఎక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎన్. వీ సుబ్బయ్య వ్యవహరించారు. ఎస్ రామారావు సభా కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

oplus_2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *