రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు

ప్రభుత్వం ఎపీ పౌర సరఫరాల సంస్థ ద్వారా 2024-25 ఖరీఫ్ సీజన్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మన్నేపల్లి, దారం వారి పాలెం, తురక పాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ …… సాధారణ రకం రూ. 2300, గ్రేడ్ ఏ రకం రూ.2320 గాను ప్రకటించిందని తెలిపారు. రవణా, గోనే సంచులు, హమాలీ చార్జీలు జిల్లాలో స్థానికంగా నిర్ణయించిన రేట్ల ప్రకారం చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. మద్దతు ధర కన్నా అధికంగా వస్తే బయట అమ్ముకోవచ్చని, మద్దతు ధరకు మాత్రమే కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని కోరారు. కళ్లంలోని ధాన్యాన్ని పరిశీలించి నిల్వలకు తగిన సూచనలు చేసారు. విఏఏ సుధీర్, ఆనగ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *