రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి – నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల ప్రతినిధులను అభినందిస్తున్న గొట్టిపాటి లక్ష్మి

రైతుల సంక్షేమమే లక్ష్యంగా వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలని దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన ముండ్లమూరు లోని ఎన్ ఎస్ పి డి ఈ కార్యాలయం ఆవరణలో మంగళవారం మోదేపల్లి మేజర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎలక్షన్ ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ పి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగినది. దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, దర్శి టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కాలువలో పేరుకుపోయిన మట్టిని పిచ్చి మొక్కలను తీసేందుకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు కనీసం గ్రీజ్ కొనుగోలు కు కూడా డబ్బులు ఇవ్వక సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని దుయ్య బట్టారు. గేట్లు కొట్టుకుపోయిన, పంటలు మునిగిపోయిన, రైతులు దెబ్బతిన్న పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం సాగునీటి వ్యవస్థలపై దృష్టి పెట్టిందని అన్నారు. కాలువ మరమ్మతులకు నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసిందని అన్నారు. చివరి ఆయాకట్టు వరకు సాగునీరు అందించేందుకు నూతనంగా ఎన్నికైన సాగునీటి ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. మోదేపల్లి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ కంచుమాటి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ వట్టి కొండ కోటేశ్వరరావు, నూతనంగా ఎంపికైన నీటి సంఘాల ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా డి సి చైర్మన్ శ్రీనివాసరావు దంపతులను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దుశ్యాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి అధికారులు డిఇ బి పూర్ణచంద్రరావు, జి ఎస్ ఎస్ సత్యనారాయణ, ఏఈ టీ ప్రసాద్, ఎస్.కె అబ్దుల్ ఖయ్యూం, మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మేదరమెట్ల వెంకటరావు, చిమ్మిలి కొండయ్య, మాజీ సర్పంచి వేముల శ్రీనివాసరావు, ఇందూరి పిచ్చిరెడ్డి, తాతపూడి తెల్లయ్య, నిడిగంటి నారాయణ, రమణాల ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *