డ్రోన్ కెమెరాలతో మెరుగైన పోలీసు సేవలందించుటయే ధ్యేయం – ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – డ్రోన్స్ ఉపయోగించి చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై రియల్ టైం నిఘా – సామాజిక బాధ్యత, స్పూర్తితో పోలీస్ శాఖకు హై-టెక్ డ్రోన్ ను బహుకరించిన కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్

మార్కాపురం సర్కిల్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ, విపత్తు నిర్వహణ మరియు ఇతర పోలీసింగ్ అవసరాల కొరకు మార్కాపురంలోని కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్ చైర్మన్ డా. కందుల గౌతమ్ నాగిరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air3s డ్రోన్ ను అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగుతున్న పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, స్పూర్తితో డ్రోన్‌ను బహుకరించటం అభినందనీయమని హాస్పిటల్ చైర్మన్ కు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ శాఖ తరుపున కృతజ్ఞతలు తెలిపారు .

జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ మాట్లాడుతూ …. డ్రోన్స్ ద్వారా లా & ఆర్డర్, నేర నియంత్రణ, రద్దీగా ఉండే జంక్షన్లు పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ట్రాఫిక్ నిర్వహణకు, కీలకమైన కేసుల్లో క్రైమ్ సీన్ మానిటరింగ్ ద్వారా నేర దృశ్యాలు సాక్షాల సేకరణకు, వివిధ బందోబస్తులు, బహిరంగ సభలు, జాతరలు/ఊరేగింపు సమయంలో జన సమూహాన్ని పర్యవేక్షించడం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అవాంఛనీయ సంఘటనలు నిలువరించుట, క్లౌడ్ పెట్రోలింగ్ ద్వారా సెన్సిటివ్/హాట్స్పాట్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించుటకు, వరదలు, భూకంపాలు వంటి విపత్తు సమయంలో రెస్క్యూ & సహాయక చర్యలు, సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టుటకు, తప్పిపోయిన వ్యక్తులు/అనుమానితులను గుర్తించడం వంటి టార్గెట్ ట్రాకింగ్ కు, తీర ప్రాంత గస్తీకి, హైవేలపై బైక్ రేసులు అరికట్టుట, ఈవ్ టీజింగ్ సర్వేలన్స్, డ్రగ్స్ విక్రయం/సేవించడం, మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీ, పేకాట స్థావరాలు, బహిరంగ/పబ్లిక్ ప్రదేశాల్లో మద్యపానం వంటి చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై రియల్ టైం నిఘా ఉంచి వాటిని నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, మార్కాపురం డిఎస్పీ U. నాగరాజు, మార్కాపురం సీఐ సుబ్బారావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ, మార్కాపురం సర్కిల్ ఎస్సైలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *