తాళ్లూరు :పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న సీసీరోడ్ల పనులనుఒంగోలు క్వాలిటీ కంట్రోల్ అధికారులు మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టారా లేదా కొలతలు తీసి పరిశీలించారు. శివరాంపురం గ్రామంలో పూర్తయిన సీసీ రోడ్లను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సిహెచ్.శ్రీనివాసరావు, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి టి.బంగారు బాబు, మండల ఏఈ వెంకటే శ్వర్లు, వర్క్ ఇన్పెక్టర్ దేవా, ఉపాది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
