దొంగతనాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకొని… చోరీ సొత్తు రికవరీ శాతాన్ని పెంచాలి – జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి – నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ – విధుల్లో విశేష ప్రతిభ చూపిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా పెండింగ్ గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు
అట్రాసిటీ కేసులు, మహిళలకు సంబంధించిన కేసులు, మిస్సింగ్‌ కేసులు మరియు ఇతర కేసులతో పాటు డిపిఓలో వివిధ పెండింగ్ రిప్లయ్స్ సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి, ఆయా కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీస్ స్టేషన్ల వారీగా UI కేసులు తగ్గించుకోవాలని, వీలైనంత త్వరగా పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలని, దర్యాప్తు పూర్తయిన కేసుల్లో చార్జీషీట్లు ఏవిధమైన ఆలస్యం లేకుండా ఫైల్‌ చేసి, కోర్టు నందు విచారణ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. POCSO కేసులు మరియు రేప్ కేసులలో దర్యాప్తు వేగాన్ని పెంచాలని, హత్య మరియు ఇతర కీలకమైన కేసుల్లో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలని, మహిళల, చిన్నారుల అదృశ్యం కేసులలో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కేసులకు సంబంధించిన అన్ని వివరాలను CCTNS లో విధిగా నమోదు చేయాలని ఎస్పీ గారు ఆదేశించారు.

రాత్రిపూట గస్తీ పెంచి, డైనమిక్‌, బీట్స్‌, ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా పెంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకొని ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని రికవరీ శాతాన్ని పెంచాలని, రౌడీ షీటర్ల, పాత నేరస్థుల స్థితిగతులను తనిఖీ చెయ్యాలని, జైలు రిలీజ్డ్ మానిటరింగ్ ద్వారా పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉన్న వారి షీట్స్ లిస్ట్ అవుట్ చేయాలని, SC/ST కేసులలో విచారణ తొందరగా పూర్తిచేసి, కోర్ట్ లో చార్జిషీట్ లను నిర్ణిత సమయంలో దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్(IRAD) ద్వారా రోడ్డు ప్రమాద డేటాను విశ్లేషించి, ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో, పొగ మంచు పడే సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించేలా చేయాలని, మైనర్ డ్రైవింగ్ చేసే వారికీ వారి తల్లిండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, పెండింగ్ చలానాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి, సైబర్ నేరాలపై ప్రజలు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు సిసి కెమెరాల పట్ల అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పేకాట, మట్కా, కోడిపందేలు మరియు చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి కట్టడి చెయ్యాలన్నారు.

వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని సూచించారు.

ప్రతిభకు ప్రశంస:-.

SC/ST, పోక్సో , మర్డర్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయుట మరియు లోక్ అదాలత్ ల్లో రాజీ మార్గంలో ఎక్కువ కేసులు డిస్పోసల్ అయ్యేలా చూడటంలో విశేష ప్రతిభ చూపిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ఈ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసాపత్రాలను అందజేసారు.

ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, SB డిఎస్పీ సురేష్ బాబు, డిఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, నాగరాజు, SB ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటి కోర్ సీఐ వి.సూర్యనారాయణ, DCRB సీఐ దేవ ప్రభాకర్, సీఐలు, ఎస్సైలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *