రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నదని తహసీల్దార్ కె.సంజీవరావు తెలిపారు. మండలంలోని లక్కవరం గ్రామసచివాలయం వద్ద బుధవారం రెవెన్యూ గ్రామ సభజరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో కాలం గా పరిష్కారంకాని భూసమస్యలు, ఇతరత్రా రెవెన్యూ సమస్యలు వుంటే దరఖాస్తుల రూపంలో అందజేయాలన్నారు. వాటిని పరిశీలించి నిబందనల మేరకు పరిష్కరిం చటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సర్వేయర్ శ్రీనివాసరావు, విఆర్వో నాగలక్ష్మి, రెవెన్యూ ఉద్యోగులు తదితరులుపాల్గొన్నారు.
