బధిరుల జోనల్ స్థాయి టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనే టీముకు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అభినందన

      జిల్లా స్థాయిలో విజయం సాధించి ఈనెల 19వ తేదీ నుంచి నెల్లూరులో జరిగే బధిరుల జోనల్ స్థాయి టీ-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనే టీమును కలెక్టర్  ఏ.తమీమ్ అన్సారియా అభినందించారు . వీరికి అవసరమైన ఆట వస్తువులు, టీషర్టులను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అందించారు. జోనల్ స్థాయిలోనూ విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి పాల్గొన్నారు. 



    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *