“ప్రేమామయుడు క్రీస్తు యేసు” – మెప్మా సిబ్బంది సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వాహణ

ఒంగోలు మెప్మా జిల్లా కార్యాలయం వద్ద మెప్మా సిబ్బంది నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో వాక్య ఉపదేశికులు రెవరెండ్ డి. అషేర్ పాల్ పాల్గోని క్రిస్తూ జనన ప్రసాస్థ్యం గురించి వివరించారు. పరిశుద్ధ గ్రంధం లోని ముగ్గురు వివేకవంతులైన స్త్రీలు ఎలిజెబెత్, మరియా, అన్నా అనే వారి గురించి సోదాహరణంగా తెలియపరచి ఆ రీతిగా ప్రతి క్రైస్తవ మహిళా జీవించాలని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ భూలోకమునకు ఏసుక్రీస్తు పుట్టుక, సమస్త మానవాళికి కలిగే ఆనందం గూర్చి, యేసుక్రీస్తు జీవిత చరిత్ర వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంనకు అధ్యక్షత వహించిన మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ..
దేవుడు వెలుగు అయ్యి ఉన్నాడు. పేదరిక నిర్ములన సంస్థ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేయబడింది. క్రీస్తు భోదించిన, ఆచరించిన విధంగా సేవాతత్పరత, ప్రేమ, కరుణ, జాలి, శాంతి, సమాధానం, క్షమా గుణం కలిగి జీవించాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా ఎండి. జాఫర్ సాధిక్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, సీనియర్ సూపరింటెండెంట్, ప్రకాశం డివిజన్ పోస్ట్ ఆఫీసెస్ మాట్లాడుతూ భారతదేశం పరమత సహనం కలిగిన లౌకిక దేశం, భిన్న మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్క్రతి, సంప్రదాయాలుతో జీవన వైవిధ్యం కలిగినప్పటికీ ఎంతో ఐక్యత, సంగీభవంతో జీవిస్తున్నామన్నారు. డిసెంబర్ మాసంలో క్రైస్తవాలు ఎంతో సంతోషంగా జరుపుకొనే క్రిస్టమస్ వేడుకలలో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా అందరికి ముందస్తు క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎం. బ్రహ్మయ్య, కె. రవి వర్మ ఆలపించిన దేవుని పాటలు ఎంతగానో అలరించాయి.
ఇంకా సీ ఓ లు కె. మరియమ్మ బైబిల్ పఠనం, రత్నకుమారి ప్రార్ధన, రాహేలు, మేరీ, సునీత, శేషరత్నం గీతాలాపన బాగున్నాయి.

మెప్మా జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షులు జి. భారతి, ఏ ఓ డేవిడ్ వినీల్, టీఈ లు జయకుమార్, సంతోష్, సీఎం ఎం జి. కల్పనా గ్రీటింగ్స్ తెలిపారు. టీఈ బివి. ఫణికుమారి వందనసమర్పణ చేసారు.
ఈ కార్యక్రమం లో జిల్లాలోని అందరు మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *