పోలీసులు మరియు పోలీస్ డాగ్స్ భద్రతాపరంగా డెమో డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

పోలీసులు మరియు పోలీస్ డాగ్స్ భద్రతాపరంగా డెమో డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ, సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయుట, పౌరులకు భద్రతా భావాన్ని కల్పించే చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు మరియు ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో ఎక్సప్లోజిప్స్ ఉన్నట్లు అనుమానాస్పదమైన బ్యాగు ఉంచి ఆ ప్రదేశంలో దాన్ని గుర్తించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై డెమో డ్రిల్ నిర్వహించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు భద్రతా పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆ ప్రదేశానికి ఎవరిని వెళ్లకుండా పౌరులు బాధ్యతగా వ్యవహరించటం గురించి, పోలీసులు చేసే విధివిధానాలు గురించి క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.

ఆర్టీసీ బస్టాండ్ లో అనుమానాస్పదంగా బ్యాగు ఉన్నట్లు వచ్చిన సమాచారంపై వెంటనే పోలీసులు బీడీ టీం,స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు డాగ్స్ స్క్వాడ్ తో సంఘటన ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ, బీటీ టీం సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించి అనుమానస్పద బ్యాగ్ ను గుర్తించారు. ఆ బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా స్నాపర్ డాగ్ గుర్తించింది. ప్రజలు ఆ ప్రదేశానికి ఎవరిని వెళ్లకుండా క్యూ మేనేజర్ ఏర్పాటు చేసినారు. పోలీసు సిబ్బంది బాంబు డిస్పోజల్ సూట్ ధరించి ఆ ఎక్స్ప్లోజివ్ నిర్వీర్యం చేశారు. ఈ డెమో డ్రిల్ ద్వారా భవిష్యత్తులో సంభవించే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా అనుమానస్పదంగా బ్యాగులు, వ్యక్తులు మరియు ఇతర వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 సమాచారం అందించాలని పోలీస్ అధికారులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు వన్ టౌన్ ఎస్సై త్యాగరాజు, ఆర్ఎస్ఐ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *