కొర్రపాటివారిపాలెం గ్రామస్తుల
రైతుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్, ప్రభుత్వంల దృష్టికి తీసుక వెళ్లేందుకు గ్రామానికి రావటం జరిగిందని ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న వెల్లడించారు. గ్రామ శివారునగల కోర్సు కొండనుండి బివికె హైవేరోడ్డు నిర్మాణానికి రోడ్డు నిర్మాణ సంస్థ వారు అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు, రైతులు, మహిళలు అడ్డుకుం టూవుండటంతో గ్రామంలో సమస్యగా మారింది. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశానుసారం గ్రామస్తులతో మాట్లాడి గ్రామస్తుల, రైతులు అభిప్రాయాలనుతెలుసుకునేందుకు గురువారం ఆర్డీవో కొర్రపాటివారిపాలెం గ్రామం వచ్చారు.
ఆమెతో పాటు పోలీసులు గ్రామంలోకి వచ్చి సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధ మయ్యారు. గ్రామస్తులంతాముకుమ్మడిగా మాకుఎలాంటి సమావేశాలు వద్దు..
కొండనుండి గ్రావెల్ను తరలించ వద్దని వెళ్లిపోండంటూ గ్రామస్తులు వెళ్లి పోబో యారు. ఆర్డివో లక్ష్మీ ప్రసన్న గ్రామస్తులను శాంత పరిచి తాను రోడ్డు నిర్మాణ కం టాక్టర్ తరుపున రాలేదని జిల్లా కలెక్టర్ గ్రామానికి వెళ్లి ప్రజల, రైతుల అభిప్రాయా లను తెలుసుని రమ్మని చెప్పారని, మీఅభిప్రాయాలు చెబితే వాటిని జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామన్నారు. ఆర్డీవో విన్నపం మేరకు గ్రామ మాజీ సర్పంచ్ కోట నరసిం హరావు గ్రామస్తుల అభిప్రాయలను తెలియపరిచారు. తరతరాల నుండి తమ గ్రామ సమీపాన నున్న కోర్సుకొండ గ్రామంలో నాలుగు సామాజిక వర్గాలకు జీవ నోపాధి కల్పిస్తున్నదన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆకొండ రాయిని కొట్టిఅమ్ముకుంటూ జీవిస్తారని, బీసీ సామాజిక వర్గం తమ జీవాలను నిత్యంఆకొండకు మేపుకు తీసుక వెలుతుంటారన్నారు. మిగిలిన సామాజిక వర్గాలవారు పశువుల మేతకు కొండకు వెళ్లి తీసుక వస్తుంటారని తెలిపారు. అంతేగా ఈ కొండనాలుగు గ్రామాలకు సమీపాన వుండటంతో గృహాలనునిర్మించుకునే వారు బేస్మట్టం కుఈమట్టిని తోలుక పోతుంటారన్నారు. గ్రామంలో దేవాలయానికి ఆస్తులు లేవని, ధూప, దీప నైవేద్యాలు పెట్టేందుకు గాను మట్టితోలకం ట్రాక్టర్ నుండి రూ10లు వసూలు చేస్తున్నట్లు, తరతరాలుగా మట్టి తోలుక వెలుతున్నా కొండ మట్టి తరగలే దన్నారు. ఇటీవల హైవే రోడ్డు నిర్మాణ సంస్థ వారు ఎలాంటి అనుమతులు లేకుం డా అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండటంతో కొండ పూర్తిగా తగ్గి తమ భవిష్యత్తుతరాల వారికి ఇబ్బందులు వస్తాయన్నారు. ఆకొండ బాపట్ల జిల్లా అద్దంకి మం డలం మోదేపల్లి ఇలాకాలో వుందని, తమ గ్రామానికి చెందిన పొలాలు రెండు. జిల్లాల పరిధిలో వున్నాయని, రెండు జిల్లాల సరిహద్దులో తమ గ్రామం ఉం దన్నారు. తమ గ్రామానికి చెందిన అద్దంకి పరిధిలోని కోర్సుకొండ నుండి అనుమ తులు లేకుండా గ్రావెల్ తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుపడితే తాళ్లూరు పోలీ సులు అడ్డుపడవద్దని గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తాళ్లూరు.తులు లేకుండా గ్రావెల్ తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుపడితే తాళ్లూరు పోలీ సులు అడ్డుపడవద్దని గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తాళ్లూరు పోలీసులకుఎటువంటి సంబంధంలేదన్నారు.గ్రామప్రజలకు జీవనాధారంకల్పిస్తున్న కోర్సు కొండ నుండి మట్టి తరలించేందుకు తాము అనుమతించబోమన్నారు. గ్రామ స్తుల చెప్పిన అభిప్రాయాలను రికార్డుచేయగా గ్రామస్తులు సంతకాలు పెట్టారు. అనంతరం ఆర్డీవో లక్ష్మిప్రసన్న, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణలు కోర్సుకొండను సం దర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.సంజీవరావు.డిటీ రాజు, సీఐ రామా రావు, ఎస్సై మల్లిఖార్జునరావు, గ్రామపెద్దలు కె.రామయ్య, గొల్లపూడి వేణుబాబు, కె.శేషయ్య, సంగం ప్రభుదాసు, కె.అంజమ్మ తదితరులు ఉన్నారు.

