విద్యార్థులు ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలని సైన్స్ ఫెయిర్ లో సెయింట్ జోన్స్ హై స్కూల్ చిన్నారులు చూపిన ప్రతిభ అద్భుతం అని బేగంపేట టిటిఐ ఇన్స్ పెక్టర్ వి. రామచందర్ అన్నారు. బ్రాహ్మణవాడి లైన్ నెంబర్ 3 సెయింట్ జోన్స్ హై స్కూల్ లో శనివారం సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. ప్రిన్సిపాల్ లక్ష్మి పాఠక్, కరస్పాండెంట్ పవన్ పాఠక్ ల ఆధ్వర్యం లో ఈ సైన్స్ ఫెయిర్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిటిఐ ఇన్స్పెక్టర్ వి రామచందర్ మాట్లాడుతూ సెయింట్ జోన్స్ హై స్కూల్లో విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాలైన ఎగ్జిబిట్స్ అద్భుతంగా ఉన్నాయని
వారు తయారుచేసిన 60 ఎగ్జిబిట్స్ ,ప్రాజెక్టుల పనితీరును వివరించిన విధానం ఎంతో ఆకట్టుకుందని అన్నారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్ లు వారి మెదడుకు మరింత పదును పెట్టేందుకు అవకాశం కలుగుతుందన్నారు. తోటి విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టును విద్యార్థులు సొంతంగా తయారు చేయడం వల్ల వారి మెదడు మరింత చురుకుగా తయారవుతుందన్నారు. ప్రత్యేక అతిధులుగా హాజరైన కే .విజయరామరాజు, అల్తాఫ్ హుస్సేన్ లు మాట్లాడుతూ ఈ సైన్స్ ఫెయిర్ సెయింట్ జోన్స్ విద్యార్థిని, విద్యార్థుల ప్రతిభకు అద్దం పడుతుందన్నారు. లక్ష్మీపాటక్,పవన్ పాఠక్ లు విద్యార్థులను నిత్యం ప్రోత్సహిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. సైన్స్ ఫెయిర్ ను సందర్శించిన విద్యార్థుల తల్లిదండ్రులు
వారి పిల్లలు చేసిన ప్రాజెక్టులను చూసి ఎంతో ఆనందించారు .సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ చూపిన మొదటి, రెండు,మూడవ స్థానంలో నిలిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు లక్ష్మీపాటక్, పవన్ పాటక్ లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


