సంతోషాన్ని ఇచ్చి సమస్యలను తొలగించి భయంను పారద్రోలే నామం ఏసయ్య అని దైవ సంబోధకుడు దాసరి ఆశీర్వాదం అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెమిక్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సీడీపీఓ సీహెచ్ భారతి, టిడిపి నాయకులు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, వేణుబాబు, రామ కోటి రెడ్డి, మారం వెంకా రెడ్డి ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఫాస్టర్ దాసరి ఆశీర్వాదం దైవ సంబోధన చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మంచిగా జీవిస్తూ ఇతరుల గురించి చెడుగా ఆలోచించక పోవటమే అన్ని మతాల దైవ సారంశం అని అన్నారు. సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. సూపర్ వైజర్ జ్యోతి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.





