బీదలను కరుణించటం ఎంతో బాగ్యం అని ఎంపీడీఓ కె సుందర రామయ్య అన్నారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో శనివారం దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి నేతృత్వంలో తాళ్లూరు టిడిపి యువ నాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, ప్రశాంతి – ఇడమకంటి సుబ్బా రెడ్డి దాతృత్వంలో పారిశుధ్య కార్మికులకు, ఎంపీడీఓ, పంచాయితీ స్వీపర్లకు దుస్తులను పంపిణీ చేసారు. సెమి క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. ఫాస్టర్ దాసరి ఆశీర్వాదం దైవ సంబోధన చేసారు. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్.
గ్రామకార్యదర్శి ఇడమకంటి రమణా రెడ్డి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుజాత, టిడిపి కొత్త పాలెం కన్వినర్ ఎం వెంకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




