విద్యార్థులకు సేవ చేసే భాగ్యం దక్కడం మాకు దేవుడు ఇచ్చిన వరం అని దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం దర్శి మండలం శివరాజ్ నగర్ వద్ద నున్న మోడల్ స్కూల్ లో 10 వ తరగతి విద్యార్థులకు అల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భముగా ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ… మా నాన్న దివంగతి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విద్య పట్ల వున్న మక్కువ కారణంగా గత 24 సంవత్సరాల నుండి విద్యార్థులకు అల్ ఇన్ వన్ మెటీరియల్ పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు ఆయన నేర్పిన ఆశయాలను కొనసాగిస్తూ నేడు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నారు.దర్శి మండలం లో అన్ని స్కూల్ లలో 800 మందికి బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు.మోడల్ స్కూల్ విద్యార్థులకు ఏ అవసరం ఉన్న మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్దం గా వున్నామని అన్నారు.ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ…. జిల్లా పరిషత్ నుండి మోడల్ స్కూల్ కి ఏటువంటి నిధులు కావాలి అన్నా మంజూరు చేస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ,వార్డ్ కౌన్సిలర్ మోహన్ రెడ్డి , పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు



