నేర నియంత్రణకు నిరంతరం నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి చేయుటకు, ప్రజల్లో భద్రత భావాన్ని పెంపోదించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ విధులు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. బీట్ తనిఖీ అధికారులు, సిబ్బంది వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి రవాణా వివరాలు, కొత్త వ్యక్తుల వివరాలు ఆరా తీసి అక్రమ రవాణాను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. బీట్ తనిఖీ అధికారులు తరచూ బీట్ పాయింట్స్ తనిఖీ చేసి, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేలా చేస్తున్నారు. నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానాస్పద/కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీశారు. పాత నేరస్తులు, అనుమానితులు, రౌడీ షీటర్లపై నిఘాను పెడుతున్నారు. గంజాయి అక్రమ రవాణా, చట్టవ్యతిరేఖ/అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ కట్టడి చేస్తున్నారు. దేవాలయాలు, ఎటిఎం కేంద్రాలు, ఇతర ముఖ్య వ్యాపార సముదాయాలు వద్ద అప్రమత్తంగా తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను విచారించి తనిఖీ చేస్తున్నారు. రాత్రి పూట దొంగతనాలు, అల్లర్లు/గొడవలు జరగకుండా, కారణం లేకుండా రాత్రి వేళ తిరిగే ఆకతాయిల పై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో లాడ్జిలు/హోటళ్లు తనిఖీ చేసి వివరాలు సేకరించి నేర నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *