వీహెచ్పీ హైందవ శంఖారావం సభకు లక్షలాదిగా తరలిరావాలి- రాధా రమణ గుప్తా జంధ్యం, సింగోతు ఏడుకొండలు -కుమ్మరిపాలెం, సీతారాంపురం, గద్దలగుంట, దేవుని చెరువు బస్తీలో శంఖారావం సభ సన్నాహక సమావేశం

దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరిట ప్రభుత్వం హిందూ దేవాలయాలపై చేస్తున్న పెత్తనాన్ని రద్దు చేయాలని, హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులను తొలగించాలని, హిందూ దేవాలయాలను హిందువులే నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ… విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన లక్షలాదిమంది హిందువుల తో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ విజయవాడలో ఏర్పాటు చేసిందని కావున హిందూ బంధువులందరూ బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వానికి మన ఆకాంక్ష తెలిపే విధముగా శంఖారావమును వినిపిద్దామని జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖు రాధా రమణ గుప్త జంధ్యం మరియు స్వయంసేవక్ నగర ప్రముఖ్ సింగోతు ఏడుకొండలు పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివారం సాయంత్రం స్థానిక సీతారాంపురంలోని వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణమున జరిపిన “హిందూ సమ్మేళనము” లో ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో స్వామివారి రథాలను తగలబెట్టడం చూసామని, రాములవారి విగ్రహానికి శిరచ్చేదం చేయడం చూసామని, హిందువుల ముడుపులను కానుకలను పథకాల పేరిట విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం, ఆలయాల్లో అన్యమతస్తులను ఉద్యోగులుగా చేర్చి హైందవ సాంప్రదాయాలను నిర్వీర్యం చేయాలని చూశారని, రాజకీయ నాయకుల ఇలాంటి చర్యలను ఇక చూస్తూ ఉండడం సహించేది లేదని హిందువులలో ఐక్యత, సమభావం, వారిని జాగృతం చేయడం కోసం విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ కు పిలుపునిచ్చిందని హిందువులందరూ తమ శక్తిని ప్రపంచానికి చాటడానికి లక్షలాదిగా విజయవాడ తరలిరావాలని పిలుపునిచ్చారు.

అనంతరం భగీరథ సర్కిల్ అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద నుండి కాషాయ పతాకాలను చేపట్టి జైశ్రీరామ్ నినాదాలతో సీతారాంపురం బస్తీలో ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటికి కరపత్రాలను చేర్చారు. ఈ కార్యక్రమంలో భార్గవ దుర్గాప్రసాద్, మెండాల సుబ్బారావు, రెడ్డి మల్లికార్జున్ రావు, మేండాల సాయిరాం, గండికోట సుశాంత్, దండూరి రామాంజనేయులు, కే పుల్లయ్య, గండికోట శివ, జూటూరు శ్రీనివాసరావు, టి భాను, ఫణి మరియు శివాజీ, ధనిశెట్టి రామునాయుడు, రాధా రమణ గుప్తా జంధ్యం, సింగోతు ఏడుకొండలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *