జిల్లా పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ హాజరై సెమి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి, అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసి, క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ………. జిల్లా పోలీస్ కమ్యూనిటీ చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్‌ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమని, సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటివి మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు. పండుగను అందరితో సోదర భావంతో కలిసి మెలిసి సంతోషంగా చేసుకోవాలన్నారు. అనంతరం పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులు, నాటక ప్రదర్శిన చేసిన చిన్నారులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి, బహుమతులను అందచేశారు.

ఈ కార్యక్రమంలో AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ అజయ్ కుమార్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ ఎస్సైలు, పాస్టర్ యం.ప్రసాద్, పోలీస్ కమిటీ చర్చి సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *