వరుస భూకంపాలపై ప్రకాశం కలెక్టర్ ను నివేదిక కోరిన మంత్రులు గొట్టిపాటి, డోలా

ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలు రావడంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలు దృష్టి సారించారు. గత రెండు రోజులుగా జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వరుసగా భూ ప్రకంపనలు రావడపై ప్రకాశం కలెక్టర్ తో ఇరువురు మంత్రులు మాట్లాడారు. తరచుగా ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలని సూచించారు. అంతేగాకుండా ఈ విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి తెలుసుకోవాలని కలెక్టర్ ని ఆదేశించారు. భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ భూకంప కేంద్రం నమోదు అవుతుంది లాంటి వివరాలను తెలుసుకునేందుకు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించాలని మంత్రులు సూచించారు.
ప్రకాశం జిల్లాలో వచ్చిన వరుస భూకంపాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని కలెక్టర్ ను మంత్రుల గొట్టిపాటి రవి కుమార్, డీబీవీ స్వామిలు కోరారు. భూకంపంపై ప్రజలు ధైర్యంగా ఉండావాలని, ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *