సేవారంగంలో ముందుండాలి – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి – ఘనంగా కాకతీయ సేవా సమితి బాలికల హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ

కమ్మవారు సేవా రంగంలో ముందుండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని కొత్త మామిడిపాలెంలో నూతనంగా నిర్మించనున్న బాలికల హాస్టల్ గృహ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పురందేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయ సేవా సమితి కేవలం కమ్మవారి అభ్యున్నతి కె కాకుండా ఇతర కులాలలోని పేదవారికి కూడా చేయూత అందించడం శుభపరిణామం అన్నారు. ఈపాటికి పలువురు పేట విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి సేవా రంగంలో ముందున్నారని అభినందించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ…. ఐక్యంగా నిలబడితే ఇటువంటి సమస్యనైనా త్వరగా తిన పరిష్కరించుకోవచ్చని సూచించారు. కమ్మవారంతా ఒకే తాటిపైకి వచ్చి సేవారంగంలో నిలవాలని హితవు పలికారు. పేదల అభ్యున్నతి తాను ఎప్పుడూ ముందు నిలుస్తానని పేర్కొన్నారు. బాలికల హాస్టల్ నిర్మాణం కోసం భగీరథ కెమికల్స్ యాజమాన్యం స్థలం ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాకతీయ సేవా సమితి జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, శ్రీ ప్రతిభ విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు, శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి,మాజీ ఒంగోలు ఏఎంసి చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, కాకతీయ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమాచార్య కీర్తనల బృందావనం ఆకట్టుకుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *