వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పలు రకాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద రైతులకు పలు పథకాలపై అవగాహన నిర్వహించారు. ప్రతి రైతు కూడ రబీలో వేసిన పంటను భీమా చేయించుకోవాలని కోరారు. విఏఏ నాగరాజు నాయక్, ఎఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
