సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా

సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, ఎంపిడిఓలను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి, స్కూల్ టాయిలెట్స్ ఇన్స్పెక్షన్, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, హౌస్ ఇమేజ్ & జియో కోఆర్డినేట్స్, ఎన్పీసీఐ లింక్, సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ అటెండెన్స్, గృహ నిర్మాణాల పురోగతిపై, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఎంఎస్ఎంఈ కు సంబంధించిన సర్వే తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ………సచివాలయ సిబ్బంది అందరూ వంద శాతం బయోమెట్రిక్ హాజరు వేసేలా ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరుపై ప్రతి రోజు మానిటరింగ్ చేయాలని, విధులుపట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంవహిస్తూ దీర్ఘకాలిక సెలవులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓలను, మునిసిపల్ కమీనర్లను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ తో జీతాలకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జడ్పి సిఈఓ ను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి జియోట్యాగింగ్ ప్రక్రియను పూర్తీ చేయాలని, అందరి బ్యాంకు ఖాతాలను ఎన్పిసిఐతో మ్యాపింగ్ చేయాలని, హౌస్ హోల్డ్ క్లష్టర్లను ఆయా హాబిటేషన్లు, గ్రామ పంచాయితీలు, రెవెన్యూ గ్రామాలతో మ్యాపింగ్ చేయాలని, హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేని వారి వివరాలను కూడా పొందుపరచాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. సచివాలయం వారిగా 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల ఆధార్ అప్డేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఎంతమందికి జనన దృవీకరణ సర్టిఫికేట్ వున్నాయి, ఎంత మందికి లేవు డేటా తీసుకొని ఐసిడిఎస్ అధికారులను సమన్వయం చేసుకొని జనన దృవీకరణ సర్టిఫికేట్ లేని పిల్లలకు జనన దృవీకరణ సర్టిఫికేట్ ఇప్పించేలా ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్కూల్ టాయిలెట్స్ పరిశీలన లక్ష్యం మేరకు వంద శాతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో లక్ష ఇళ్ళను సామూహికంగా ప్రారంభోత్సవాలు చేపడుతున్న నేపధ్యంలో జిల్లాలో 3,800 ఇళ్ల నిర్మాణ లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 2, 101 ఇళ్ళు పూర్తి చేయ్యడం జరిగిందని , మిగిలిన ఇళ్ళ నిర్మాణాలను రోజువారీ లక్ష్యాలను నిర్దేసించుకొని త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి 90 రోజుల పని దినాలు లక్ష్యం మేరకు కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైన తాగునీటి అవసరాలను గుర్తించి డిమాండ్ సర్వ్ పక్కాగా చేపట్టి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, ఆర్. డబ్ల్యూ.ఎస్. అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లాలో ఎంఎస్ఎంఈ కు ( సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల స్థాపన) సంబంధించిన సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో సమగ్రంగా పరిశీలన చేసిన తరువాతనే నాట్ వర్కింగ్ యూనిట్స్ వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో 73 సచివాలయాల్లో ఎంఎస్ఎంఈ సర్వ్ చేపట్టలేదని, వెంటనే సంబంధిత సచివాలయాల్లో సర్వే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అన్నీ అభివృద్ధి కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా ఎంపిడిఓ పూర్తి భాద్యత వహించాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో జడ్పి సిఈఓ చిరంజీవి, ఆర్.డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిశ్రమల శాఖాదికారి శ్రీనివాస రావు, సిపిఓ వేంకటేశ్వర రావు, ఐసిడిఎస్ పిడి హేన సుజన, మెప్మా పిడి రవి కుమార్ పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓ లు, ఎంపిడిఓ లు, ఈఓ పిఆర్డిలు, ఎపిఓ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *