క్రిస్మస్ సందర్భంగా సోమవారం దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని పి.టి.ఎస్ కళ్యాణ మండపంలో పాస్టర్లు క్రీస్తు సేవకులకు పలువురు క్రైస్తవుల ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరించారు. విశ్వ ప్రపంచం గెలిచిన ఏసుక్రీస్తు కష్టాల నుండి సుఖాల వైపు, అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు, అశాంతి నుండి శాంతి వైపు దుఃఖంలో ఉన్న వారికి ఆనందాన్ని పంచిపెట్టే క్రీస్తు సందేశాన్ని విస్తృతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నాయకురాలుగా మీ వద్దకు రాలేదు మీలో ఒక సేవకురాలుగా నేను మీ ముందుకు వచ్చాను …….క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉందని క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ప్రతి కుటుంబం సంతోషాలతో విరజిల్లాలని ప్రభువు అందరిని దీవించి ప్రార్థిస్తాడని ఆమె తెలిపారు. ఆనందాన్ని పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా ఉండదన్నారు. అన్ని మతాలను, కులాలను గౌరవించి పేదలకు ఆకలిని తీర్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆమె అభిప్రాయపడ్డారు. మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మైనార్టీలకు ఒక రకమైన ధైర్యం, జీవితంపై భరోసా ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లలో అల్పసంఖ్యాక వర్గాలు ఆకలి బాధలు, దౌర్జన్యాలు, దాడులతో బిగ్గుబిక్కుమని బతికారు అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా పాస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి ప్రభువు ఇచ్చిన జ్ఞానం మనకెంతో దోహద పడాలని కోరారు. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందుతుందని ఈ క్రిస్మస్ అభివృద్ధి క్రిస్మస్ గా జరుపుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు నారసట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఐదు మండల టిడిపి అధ్యక్షులు ఎం శివ కోటేశ్వరావు, పి నెమలియ్య, కూరపాటి శ్రీను, బి ఓబుల్ రెడ్డి, నియోజకవర్గం పాస్టర్ల దంపతులు, వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, మహిళలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


