దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దర్శి మండలం, తానాంచింతల గ్రామం లో సోమవారం జాతీయ రైతు దినోత్సవ సందర్బంగా పొలాలకు వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ గారు మాట్లాడుతూ ……రైతులను రాజును చేయాలనే లక్ష్యంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మిర్చి వంటి పంటలను నిల్వ చేసుకునేందుకు దర్శి మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. సాగర్ కుడి కాలువ చివర భూములను దర్శి ప్రాంతంలో కాల్వలు మరమ్మతులు చేసేందుకు మంత్రి రామానాయుడుతో చర్చించానని తెలిపారు. వైసీపీ నిర్లక్ష్యనికి గురైన వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కృషి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మహిళ రైతులతో ముచ్చటించి వారి సాధక బాధలు తెలుసుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీరైతుల నీ కష్టం వెలకట్టలేనిది అన్నారు. రైతుల రుణం తీర్చుకోలేనిది మా ప్రతి రోజూ నీదే రైతన్నఅని అన్నారు. . .. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం మాది అని గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్బంగా రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
