విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి అన్నారు. తాళ్లూరు సరస్వతి హై స్కూల్ లో మంగళవారం వార్షికోత్సవ,
క్రీడా సంబరాలు-24 కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ …..చదువులతో పాటు క్రీడలు విద్యార్థులకు ముఖ్యమని అన్నారు. క్రీడా స్పూర్తిని నింపటం కోసం విద్యాసంస్థలో గత మూడు రోజుల నుండి క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా సరస్వతి విద్యాసంస్థల డైరెక్టర్ ఎజీ శంకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీరామ మూర్తి, వెంకట రత్నం, వెంకా రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

