పంట కోత ప్రయోగాలతో బహుళ ప్రయోజనాలు ముగిపడి ఉన్నాయని దర్శి ఎడీఏ బాలాజీ నాయక్ అన్నారు. మండలంలోని లక్కవరం, తూర్పుగంగవరం, నాగంబొట్ల పాలెం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చిన వివరాలను పరిశీలించారు. వివరాలను గణాంక శాఖకు పంపనున్నట్లు చెప్పారు. ఈ రిపోర్టుల ఆధారంగా ఎగుమతులు, దిగుమతులు, ధరల స్థిరీకరణ, నియంత్రణ మొదలగు అంశాలు ఆధార పడి ఉంటాయని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో తీరుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఆత్మ ఎటీఎం కె రామి రెడ్డి, విఏఏ లు బార్గవి, వీరాంజ నేయులు, సుమ తదితరులు
పాల్గొన్నారు.
