ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం ఉదయం ఒంగోలు, మామిడిపాలెం భాగ్యనగర్ నందు గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సందర్శించి
అసెంబ్లీ నియోజక వర్గాలు వారీగా ఈ వి ఎమ్ లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి
పరిశీలించి సంబంధిత రిజిస్టర్ లో సంతకాలు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును, స్ట్రాంగ్ రూమ్ లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది.
కలెక్టర్ వెంట ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, పొలిటికల్ పార్టీలకు చెందిన వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, టీడీపీ నుండి కోనేటి వెంకటరావు , బీజేపీ నుండి బసినేపల్లి రాజశేఖర్, కాంగ్రెస్ నుండి ఎస్.కె రసూల్, సిపిఎం నుండి రఘురామ్, రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర, నవీన్ , ఎన్నికల సెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


