బాల సదన్ ను రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖbప్రిన్సిపల్ సెక్రటరీ సూర్య కుమారి మంగళవారం సందర్శించారు. చిన్నారులు బాల సదన్ కు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అనే విషయాలను తెలుసుకుని వారిని తల్లిదండ్రుల చెంతకు త్వరగా చెరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా చూడాలని చెప్పారు. వారిని దత్తత తీసుకునే తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని వారికి ఒక కుటుంబం ఏర్పడేలా చూడాలని సూచించారు. క్రిస్టమస్ వేడుకలలో పాల్గొని చిన్నారులకు పండుగ ప్రాముఖ్యతను తెలిపారు. ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హెన సుజన్, జిల్లా బాలల సంక్షేమాధికారి దినేష్ కుమార్ బాల సదన్ సిబ్బంది పాల్గొన్నారు.

