భూకంప ప్రకంపనల వల్ల భయాందోళన వద్దు -జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ డి. శశిధర్ – ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహణ

గ్రామాల్లో తరుచూ సంబవించే భూకంపప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళన చెంద వద్దని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ డి. శశిధర్ తెలిపారు. తాళ్లూరు మండలపరిషత్ సమావేశం హాలులో గురువారం ఒంగోలుఆర్డీవో లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన భూకంపాలపై ప్రజ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అద్దంకి సమీపాన గల గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వల్ల ఈ ప్రాంతంలో భూకంపం సంవించవన్నారు. రిక్టర్ స్కేల్పై 5.5 దాటితే ప్రమాధాలు సంభవించే అవకాశాలున్నా యన్నారు. ఈ ప్రాంతంలో తక్కువ మోతాదులో భూకంపం సంభవిస్తున్నందు న్నారు. దీనివల్ల ఆస్థి, ప్రాణ నష్టం జరుగవన్నారు.ఈ ప్రాంతంలో భూకంపాలు. సంభవించి నప్పుడు నేలలో పెద్ద శబ్దాలుమాత్రమే విన్పిస్తున్నట్లు తమ పరిశీలనలో నిర్ధారణైందన్నారు. భూమి కంపించినప్పుడు భయాందోళన చెందక ప్రశాంతంగా వుండాలని తెలిపారు. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న మాట్లాడుతూతాళ్లూరు,ముండ్లమూరు మండలాల్లో 3 రోజుల క్రితం వరుసగా భుకం పాలు వచ్చి నందున జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రజలు భయాందోళన చెందకుండా వుండేందుకు అవగాహన సదస్సులునిర్వహిస్తున్నారన్నారు. ప్రజలుఎలాంటి ఆందోళన చెంద వద్దని, ఇటీవల సంభవించిన భూకంపంవల్ల ప్రజల్లో వున్న భయాందోళనలు పొగొట్టేం దుకు తగుచర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపివిపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ బస్వంత్ రెడ్డి, జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ శశిధర్, డాక్టర్ సురేష్ , తహసీల్దార్ కె.సంజీవరావు,డిప్యూటీతహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, ముండ్లమూరు తహసీల్దార్లో శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, శాగంకొండారెడ్డి, మేడగం వెంకటేశ్వరరెడ్డి, మండల సర్వే యర్ శ్రీనివాసరావు, ఆర్ ఆనూష, విఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
oplus_2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *