పదో తరగతి విద్యార్థుల ఉత్తమఫలితాల సాధన కోసం సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధి కారి ఎన్. లక్ష్మినాయక్ తెలిపారు. అలాగే పాఠశాల నుంచి వసతి గృహానికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నియమితులైన ట్యూటర్లతో శిక్షణ, సాధన చేయిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి; అందులో సీ, డీ కేటగిరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ కాంపొనెంట్ కింద జిల్లా ప్రజా పరిషత్ ద్వారా ఆల్ ఇన్ వన్ గైడ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దా రవీడు, యర్రగొండపాలెం, పెద్దదో ర్నాల మండలాల్లో మెనూ ప్రకారం వసతి గృహ విద్యార్థులకు అల్పా హారం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
