దేశ అభివృద్ధికి మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివి. – దర్శి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి

భారత దేశ అభివృద్ధికి దేశ పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివని దర్శి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ….దేశంలో ఆర్థిక సంస్కరణల అమలులో తనదంటూ ఒక ముద్ర వేసి దేశ ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కుతుందని ఆయన లేని లోటు దేశానికి తీరనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *